దీపక్ హుడా పూర్ ప్రదర్శన.. సీఎస్‌కే ఓటమికి కారణం!

చెన్నై మైదానంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ దీపక్ హూడా మరోసారి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పేసర్ల ముందు హూడా నెమ్మదిగా ఆడి 21 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఒక సిక్స్‌, ఒక ఫోర్ మాత్రమే హిట్ చేశాడు. చివరి వికెట్‌గా అవుట్ అయిన హూడా పోరాటంతో చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.

గత మూడు మ్యాచ్‌లలో హూడా 3, 4, 0 పరుగులతో విఫలమవుతూ చెన్నైకి ఇబ్బంది తెచ్చాడు. ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ అతడి ఫామ్ జారిపోయింది. గత ఏడాది మెగా వేలంలో చెన్నై అతడిని రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసినా, హూడా ఫలితాలు ఇవ్వడంలో విఫలమయ్యాడు. గత సీజన్‌లో లక్నో తరఫున 9 ఇన్నింగ్స్‌లో 145 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ మొత్తం కెరీర్‌లో హూడా ఇప్పటి వరకు 122 మ్యాచ్‌ల్లో 1494 పరుగులు చేసి, 17.79 సగటుతో, కేవలం 8 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. 2022 సీజన్‌లో మంచి ఫామ్‌లో కనిపించిన హూడా, 2023, 2024 సీజన్‌ల్లో పూర్తిగా పేలవంగా ఆడాడు. 2023లో 12 మ్యాచ్‌ల్లో 84 పరుగులు, 2024లో 11 మ్యాచ్‌ల్లో 145 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న 2025 ఐపీఎల్ సీజన్‌లో 4 మ్యాచ్‌ల్లో కేవలం 29 పరుగులు మాత్రమే చేసి, 74.36 స్ట్రైక్ రేటుతో దారుణంగా ఆడుతున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ హర్షల్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించడంలో అతడి పాత్ర కీలకంగా నిలిచింది.

Read More : భారత క్రికెటర్ల జాబితాలో మరో కీలక మైలురాయికి చేరుకున్న మహేంద్ర సింగ్ ధోనీ

One thought on “దీపక్ హుడా పూర్ ప్రదర్శన.. సీఎస్‌కే ఓటమికి కారణం!

Comments are closed.