సీఎం మర్యాదపూర్వకంగా కలిసిన సీపీఆర్వో గుర్రం మల్సూర్

నూతనంగా ముఖ్యమంత్రి సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన గుర్రం మల్సూర్ మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మల్సూర్, తనకు కల్పించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పాలనా అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచార ప్రకటనలు, పత్రికా ప్రకటనలు సమర్థంగా సమన్వయం చేసేందుకు తన అనుభవాన్ని వినియోగిస్తానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్సూర్‌కు అభినందనలు తెలుపుతూ, ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

Read More : రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ సవాల్

One thought on “సీఎం మర్యాదపూర్వకంగా కలిసిన సీపీఆర్వో గుర్రం మల్సూర్

Comments are closed.