లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు క్రికెట్ జట్లు ఘన నివాళి అర్పించాయి. శుక్రవారం మూడో రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు ఒక్క నిమిషం మౌనం పాటించారు. అంతేగాకుండా సంతాప సూచకంగా నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి ప్రవేశించారు. అంపైర్లు కూడా నల్ల బ్యాండ్లు ధరించి సంఘీభావం ప్రకటించారు.
ఇక, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా అంతే విధంగా మౌనం పాటిస్తూ, చేతులకు నల్ల ఆర్మ్ బ్యాండ్లు ధరించి విమాన ప్రమాద బాధితులకు నివాళి అర్పించారు.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదం అహ్మదాబాద్‌లోని మేఘాని ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, పది మంది క్రూ సిబ్బందితో సహా మొత్తం 265 మంది దుర్మరణం చెందారు.
Read More : ఒకే పది రోజుల్లో రెండు ఫైనల్స్‌లో ఓటమి: Iyer

One thought on “అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి క్రికెటర్ల నివాళి”
Comments are closed.