తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఢిల్లీలో జరుగుతున్న సమావేశంపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. కేంద్రం ఈ భేటీకి చొరవ చూపిన విధానం శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు. నారాయణ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నదీజలాల సమస్యలు ఉండేవని గుర్తు చేశారు. మిగులు జలాల్లో ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకోవాలో స్పష్టంగా నిర్ణయించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులపై కాకుండా నీటి పంపిణీపై చర్చ జరగాలని సూచించిన ఆయన, లేకపోతే రెండు రాష్ట్రాలకూ నష్టం జరిగే అవకాశముందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల నాయకత్వం పునరాలోచన చేసుకుని, సహకార దృక్పథంతో సమస్యలను పరిష్కరించాలన్నది నారాయణ సూచన.
Read More : తీన్మార్ మల్లన్నకు నోటీసులు

2 thoughts on “తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సీపీఐ నారాయణ స్పందన”
Comments are closed.