కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడుతున్న తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నది అర్థం లేకుండా ఉందని, ఆయనకు ఈ విషయంపై కనీస అవగాహన లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు:
“పొలిటికల్ రిజర్వేషన్లలో సబ్-కేటగరైజేషన్ లేదు. ముస్లింలకు రిజర్వేషన్లు కూడా లేవు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఆయన కేంద్ర మంత్రి అయ్యారు” అని రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కిషన్ రెడ్డికి అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని సీఎం అన్నారు.
One thought on “ముస్లిం రిజర్వేషన్లపై సీఎం ఆగ్రహం”
Comments are closed.