బీసీల ధర్నా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గలేదు. తాను ఎలాంటి తప్పు మాట్లాడలేదని, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడానని ఆమె మరోసారి స్పష్టం చేశారు.
నిన్న ఆమె మాట్లాడుతూ, రాష్ట్రపతి ముర్ము ఒక దళిత మహిళ కాబట్టే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించలేదని ఆరోపించారు. ప్రధాని మోదీకి జాతి వివక్ష ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
ఈ రోజు తన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె, తాను మాట్లాడింది సరైనదేనని, ఆ వ్యాఖ్యలపై మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Read More : ముస్లిం రిజర్వేషన్లపై సీఎం ఆగ్రహం

One thought on “వెనక్కి తగ్గని మంత్రి కొండా సురేఖ”
Comments are closed.