మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం, ఎర్త్ అవర్ ఒకే రోజు రావడం సంతోషకరమని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మానవ జీవితంలో నీరు, విద్యుత్ కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఎర్త్ అవర్ సందర్భంగా ఇవాళ (శనివారం) రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాల్సిందిగా సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు. ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో లైట్లు, విద్యుత్ ఉపకరణాలను గంటపాటు ఆపివేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలను కలిపి, భవిష్యత్తు తరాలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే అవకాశముందని అన్నారు.
స్వర్ణ ఆంధ్ర 2047 మార్గదర్శక సూత్రాల్లో నీటి భద్రత, ఇంధన పొదుపు అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ తరాల కోసం నీరు, విద్యుత్ వనరులను పొదుపుగా వినియోగించుకోవడం అనివార్యమని పేర్కొన్నారు.అధికారుల కృషి మాత్రమే సరిపోదని, అందరి భాగస్వామ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు. చిన్న చర్యలు పెద్ద మార్పులకు దారితీయగలవని, అందరూ కలిసి కృషి చేస్తే ప్రభావవంతమైన ఫలితాలు సాధించవచ్చని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
Read More : జగన్కు ఊహించని షాక్ – హైకోర్టులో హరిరామజోగయ్య పిటీషన్

One thought on “CM Chandrababu Tweet: నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై సీఎం చంద్రబాబు పిలుపు”
Comments are closed.