చిత్తూరులో ల్యాబ్ టెక్నీషియన్‌తో యువకుడు పరార్

చిత్తూరు జిల్లాలో ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 38 ఏళ్ల మహిళతో ప్రేమలో పడిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి (19) ఆమెతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఆ మహిళ, కాలేజీలో పనిచేస్తూ ఆ విద్యార్థితో పరిచయం పెంచుకుంది.

మే 24న బెంగళూరులో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్తున్నట్లు చెప్పి తల్లిదండ్రులను నమ్మబలికిన విద్యార్థి, ఆ మహిళతో వెళ్లిపోయాడు. ఎన్నాళ్లైనా కుమారుడు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. విచారణలో అసలు విషయం బయటపడటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఆ విద్యార్థి మరియు మహిళను బెంగళూరులో గుర్తించి చిత్తూరుకు తీసుకువచ్చారు. అనంతరం ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, వారి వారి కుటుంబాల వద్దకు పంపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Read More : పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి పెరిగింది

One thought on “చిత్తూరులో ల్యాబ్ టెక్నీషియన్‌తో యువకుడు పరార్

Comments are closed.