తిరుపతిలో గంజాయి రవాణా కేసులో ఇద్దరు అరెస్ట్

తిరుపతిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, నగరంలోని చెక్‌పోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని పరిశీలించగా, అందులో గంజాయి దొరికింది. సుమారు రూ.80 వేల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన నిందితులు పుట్టపర్తి జిల్లాకు చెందిన గాలురు చంద్రమోహన్, చిలమత్తూరు మండలం ఇరసపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Read More : చిత్తూరులో ల్యాబ్ టెక్నీషియన్‌తో యువకుడు పరార్

One thought on “తిరుపతిలో గంజాయి రవాణా కేసులో ఇద్దరు అరెస్ట్

Comments are closed.