న్యూఢిల్లీ, మార్చి 14, 2025: తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును (₹) తొలగించి “రూ.” అక్షరాన్ని చేర్చిన అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఈ విషయంలో డీఎంకేను తప్పుబట్టిన ఆమె, 2010లో కేంద్రం అధికారికంగా ₹ గుర్తును ఆమోదించినప్పుడు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో డీఎంకే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం గుర్తుచేశారు.
భారతదేశం యూపీఐ సేవలను అంతర్జాతీయంగా ప్రాచుర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, సొంత కరెన్సీ చిహ్నాన్ని బలహీనపరచడం కాదా అని ఆమె ప్రశ్నించారు. “₹” గుర్తు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిందని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఈ చర్య జాతీయ ఐక్యతకు వ్యతిరేకమై, వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తుందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
