పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఏడాది పూర్తి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను’’ అనే పేరిట రూపొందించిన ఈ వీడియోలో జనసేన ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి చర్యలు, పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం లోని ముఖ్య ఘట్టాలను వివరించారు.

ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీరు అందించేందుకు చేపట్టిన చర్యలు, 55 గిరిజన గ్రామాలకు 39 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించడం, కుంకీ ఏనుగులను రప్పించడం, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేయడం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ వీడియోలో ప్రస్తావించారు.

పిఠాపురంలో ఆయన సాధించిన తొలి ఎన్నికల విజయంతో పార్టీకి 100 శాతం విజయ రేటు సాధించిన తీరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన విధానం ప్రత్యేకంగా హైలైట్ చేశారు. పవన్ కల్యాణ్ చూపిన సహనం, పట్టుదల, వ్యూహాత్మకంగా చేసుకున్న పొత్తులద్వారా జనసేనను రాష్ట్ర రాజకీయాల్లో కీలకస్థానానికి తీసుకువచ్చినట్లు వీడియోలో వివరించారు.

సంకీర్ణ ప్రభుత్వంలో వచ్చే అంతర్గత విభేదాలను చాకచక్యంగా పరిష్కరించడం ద్వారా ఆయన ప్రదర్శించిన రాజకీయ కౌశలం ప్రధాని నరేంద్ర మోదీ వంటి జాతీయ నేతల ప్రశంసలను కూడా అందుకున్న విషయం ఇందులో ప్రస్తావించారు.

ఈ వీడియో ద్వారా పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని అందించడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలనపైనా తమ నిబద్ధతను ప్రజలకు గుర్తు చేయడమే లక్ష్యమని జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.

Read More : ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి

One thought on “పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఏడాది పూర్తి.

Comments are closed.