ఇంటర్నెట్ కేబుళ్ల తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

ktr

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “జోకర్‌ను ఎన్నుకుంటే, పాలన కూడా సర్కస్‌లా మారుతుంది” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలనే పేరుతో అధికారులు ఇంటర్నెట్‌ సహా అన్ని కేబుల్‌ వైర్లను తొలగించడంపై మండిపడ్డారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు తీసుకున్న ఈ అవివేక నిర్ణయం వల్ల లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎస్పీలకు గానీ, వినియోగదారులకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేబుళ్లను కత్తిరించడం సరైంది కాదని ప్రశ్నించారు.

ఈ చర్య కారణంగా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులు, ఆన్‌లైన్ సేవలపై ఆధారపడిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. బాధితుల ఆవేదనతో సోషల్ మీడియా నిండిపోయిందని పేర్కొన్నారు. ఇంటర్నెట్ కేబుళ్లలో సమస్య ఉంటే, దానిని సక్రమంగా పరిష్కరించాలిగానీ, మొత్తం తొలగించడం అన్యాయం అని హెచ్చరించారు.

రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

Read More : సుదర్శన్ రెడ్డిని గెలిపించడం తెలుగువారి బాధ్యత