400 కుటుంబాలపై బహిష్కరణ, బాధితులకు వైఎస్ జగన్ మద్దతు

Ys jagan

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు మరింత తీవ్రతరమవుతున్నాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై కూటమి ప్రభుత్వం బహిష్కరణ వేటు వేసింది. ఈ బాధిత కుటుంబాలన్నీ ఎస్సీ, బీసీ, మైనార్టీలకే చెందుతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తమపై జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, గ్రామంలోకి వస్తే ప్రాణహాని ఎదురవుతుందనే బెదిరింపులు ఎదుర్కొంటున్నామని విన్నవించుకున్నారు.

ఈ విషయంపై వైఎస్ జగన్ స్పందించి బాధితులకు పూర్తి మద్దతు ప్రకటించారు. న్యాయ సహాయం అందిస్తామంటూ హామీ ఇచ్చారు. అంతేకాదు, పిన్నెల్లి గ్రామంలో జరుగుతున్న దమన రాజకీయాలను నిరసిస్తూ త్వరలో ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమాన్ని చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది.

ఈ సమావేశంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More

One thought on “400 కుటుంబాలపై బహిష్కరణ, బాధితులకు వైఎస్ జగన్ మద్దతు

Comments are closed.