సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి అకౌంటెన్సీ పరీక్షల్లో ప్రాథమిక కేలికులేటర్ల వినియోగానికి అనుమతి ఇవ్వాలని పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటై కేలికులేటర్ల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
CBSE అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ కొత్త మార్పు విద్యార్థులకు లెక్కలు చేసే ఒత్తిడిని తగ్గించడంతో పాటు, కేస్ స్టడీస్ మరియు విశ్లేషణలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. విద్యార్థులు సాధారణ గణనల్లో ఎక్కువ సమయం వెచ్చించకుండా, ఆలోచనాత్మకంగా సమాధానాలు కనుగొనే అవకాశాన్ని ఈ మార్పు కల్పించనుంది.
విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో CBSE ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తోంది. అయితే, కేలికులేటర్ వినియోగానికి సంబంధించి కచ్చితమైన మార్గదర్శకాలను ఒక ప్రత్యేక ప్యానల్ రూపొందించనుంది. ఈ మార్గదర్శకాలు ఖరారైన తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఈ మార్పు అమలులోకి వస్తే, CBSE 12వ తరగతి అకౌంటెన్సీ పరీక్షల విధానంలో ఇది ఒక కీలక మార్పుగా నిలుస్తుంది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్న ఈ నిర్ణయం పై, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అకడమిక్ నిపుణుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
Read More : ఎంపీలకు జీతాల పెంపు
