పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం చెందిన బీఎస్ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం.డి. ఇంతియాజ్‌కు శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బిహార్‌కు చెందిన ఇంతియాజ్ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించి పూర్తి గౌరవాలతో అంత్యక్రియలు జరిగాయి.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి బిహార్ రాష్ట్ర మంత్రి నితిన్ నబిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. దేశానికి సేవలందించిన ఇంతియాజ్ త్యాగాన్ని వారు స్మరించుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇంతియాజ్ వీర మరణంపై రాష్ట్రవ్యాప్తంగా బాధా శోకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమని అధికారులు తెలిపారు.

Read More : పాకిస్థాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు భారీ నష్టం

One thought on “బీఎస్ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు అధికార లాంఛనాలతో వీర వీడిక..”
Comments are closed.