BSF జవాన్‌… భారత్‌కు తిరిగొచ్చాడు

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్ పూర్ణమ్ కుమార్ షాను, అనుకోకుండా 2025 ఏప్రిల్ 23న అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ వైపు వెళ్లిన ఘటనలో, అక్కడి పాక్ రేంజర్స్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పాక్ అధికారులు భారత అధికారులతో సంప్రదనలు జరిపిన అనంతరం, సోమవారం పూర్ణమ్ కుమార్‌ను సురక్షితంగా భారత్‌కు అప్పగించారు.

అనుకోకుండా బోర్డర్ దాటిన షాను ప్రస్తుతం భారత అధికారుల వద్ద సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది.

ఈ తరహా ఘటనలు రెండు దేశాల మధ్య బలమైన కమ్యూనికేషన్ అవసరాన్ని గుర్తు చేస్తాయి.

Read More : ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం.