బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ దూకుడు

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్వయంగా నేతృత్వం వహించనున్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానుసారం, కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బీసీ నేతలు కలిసి ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్నారు. అదే సమయంలో ఆగస్టు 8న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సభ వేదికగా బీసీ రిజర్వేషన్లపై తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరై, బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని బహిరంగంగా ప్రశ్నించనున్నారు.

ఇదిలా ఉంటే, బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశం ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, బీసీ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీలు కలసి డ్రామా ఆడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపి కాంగ్రెస్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

“బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, మిగిలిన మూడు మంత్రి పదవులను బీసీలకే ఇవ్వాలి,” అని తలసాని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో డ్రామాలు ఆపాలని హితవు పలికారు.

Read More : బీజేపీ నా ఇల్లు, మళ్లీ చేరేందుకు సిద్ధం

One thought on “బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ దూకుడు

Comments are closed.