“ఐ లవ్ యూ” అని చెప్పడం ఒక్కటితోనే లైంగిక వేధింపుగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలికకు ప్రేమప్రకటన చేసిన కేసులో దోషిగా గుర్తించి శిక్ష విధించిన సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… 2015 అక్టోబర్‌లో, 11వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు ఓ యువకుడు “ఐ లవ్ యూ” అన్నాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు, 2017 ఆగస్టులో యువకుడికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యువకుడి తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, “ఐ లవ్ యూ” అనే మాటను ప్రేమ భావనగా మాత్రమే పరిగణించాల్సిందే కానీ, అది లైంగిక వేధింపుగా భావించలేం అని తేల్చిచెప్పింది. యువకుడి వైఖరిలో లైంగిక ఉద్దేశం లేదని, ఇతర ఎటువంటి తప్పుడు ప్రవర్తనకు ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ మేరకు నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు రద్దు చేసింది. న్యాయనిర్ణయంలో తగిన వివరాలు, ప్రమాణాలు లేకుండా శిక్ష విధించడం సరైంది కాదని పేర్కొంది.
Read more : సిగాచి పేలుడు ఘటనలో సహాయక చర్యలకు వర్షం అడ్డంకి
Our YouTube Channel Click Here

2 thoughts on ““ఐ లవ్ యూ” లైంగిక వేధింపు కాదు”
Comments are closed.