తమిళనాడులోని సిగాచి పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ వర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. మరోవైపు, భవన శిథిలాల కింద నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
శిథిలాల కింద ఇంకా మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీడి, సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన వారికోసం రెస్క్యూకార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్థానిక అధికార యంత్రాంగం, అగ్నిమాపక దళం, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు సంఘటితంగా సహాయక పనులు చేపడుతున్నాయి. సహాయక చర్యల్లో వాతావరణం కూడా కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
Read More : ఎయిరిండియా విమానం గాల్లో 900 అడుగుల పతనం…

One thought on “సిగాచి పేలుడు ఘటనలో సహాయక చర్యలకు వర్షం అడ్డంకి”
Comments are closed.