తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లితో సమానమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు బడుగు, బలహీన వర్గాలకు పార్టీలో సముచిత స్థానం కల్పించారని, దేశ చరిత్రలో నిలిచిపోయేలా కోటి మంది సభ్యత్వాలతో టీడీపీ ముందుకు సాగుతోందని తెలిపారు.
రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ఉద్యమమని అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ నిరంతరం కృషి చేస్తోందని, పార్టీకి అడ్రస్ లేదని సవాల్ చేసినవారు ప్రస్తుతం చరిత్రలో అడ్రస్ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు కల్పించింది టీడీపీ మాత్రమేనని స్పష్టంచేశారు. పార్టీ కార్యకర్తలు టీడీపీ రథసారథులు అని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని నాయుడు పేర్కొన్నారు.

2 thoughts on “తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రామ్మోహన్ నాయుడు పిలుపు …”
Comments are closed.