ప్రియాంకా చోప్రా భర్త, ప్రముఖ గాయకుడు నిక్ జోనస్ ప్రస్తుతం బ్రాడ్‌వే మ్యూజికల్ ‘ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్’లో నటిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లో ఉన్న ఆయన, అక్కడ గడిపిన సమయాన్ని ఎంతో ప్రత్యేకంగా అభివర్ణించారు. న్యూయార్క్‌లో ఒకే చోట స్థిరంగా ఉండటం తమకు అరుదైన అనుభవమని, అది కుటుంబంతో గడిపే గొప్ప సమయంగా మారిందని నిక్ తెలిపారు.
నిక్ మాట్లాడుతూ, చిన్నారి మాల్తీ మేరీ ఇప్పటికే థియేటర్‌కు వచ్చిందనీ, తన ప్రాక్టీసులు చూస్తూ అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుందనీ చెప్పారు. “ఆమెను చురుకుగా, ఆనందంగా ఉంచేందుకు మేమిద్దరం ప్రయత్నిస్తున్నాం. విసుగుతో కూడిన షెడ్యూళ్ల మధ్య, కుటుంబ సమయాన్ని కనెక్ట్ చేసుకోవడం అద్భుతంగా ఉంది,” అని నిక్ ఆనందం వ్యక్తం చేశారు.
మరొక ఇంటర్వ్యూలో నిక్ తన భార్య ప్రియాంకపై అభిమానం వ్యక్తం చేశారు. వ్యక్తి తన కలల వైపు పరుగులు తీస్తూ ఎప్పుడో ఓ సమయంలో తానెవరినో మరిచిపోతాడని, అలాంటి సందర్భాల్లో మనకు తోడు నిలిచే, మద్దతు ఇచ్చే జీవిత భాగస్వామి ఎంతో కీలకమని అన్నారు. ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో ప్రియాంక ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి SSMB29 చిత్రంపై పనిచేస్తున్నారు. మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో కాశీలో కథనం తిరుగుతుందని సమాచారం. ఈ చిత్రం 2027 సమ్మర్‌లో విడుదల కానుంది.

One thought on “బిజీ షెడ్యూళ్ల మధ్య ఫ్యామిలీ టైమ్ – నిక్ జోనస్ ఎమోషనల్ కామెంట్స్”
Comments are closed.