విమానాన్ని తిరస్కరించను: ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఖతార్ రాజ కుటుంబం నుంచి బహుమతిగా వస్తున్న విలాసవంతమైన బోయింగ్ 747-8 జంబో జెట్‌ను స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. ఉచితంగా లభిస్తున్న ఖరీదైన విమానాన్ని ఎందుకు తిరస్కరించాలన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, “ఇలాంటి బహుమతిని తిరస్కరించడమంటే తెలివితక్కువ నిర్ణయం. ఉచితంగా వస్తున్నప్పుడు ఎందుకు వద్దంటాను?” అంటూ ప్రశ్నించారు. ఖతార్ ఇచ్చే ఈ బహుమతితో వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు.

తన పదవీకాలం ముగిశాక ఈ విమానాన్ని వ్యక్తిగతంగా ఉపయోగించాలా అన్న ప్రశ్నకు ట్రంప్ ఘాటుగా స్పందించారు. “ఇది తీసుకోకపోతే డబ్బు చెల్లించాలా?” అంటూ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ జెట్‌ను తన అధ్యక్ష లైబ్రరీకి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇక ఖతార్ తరఫున ప్రతినిధులు స్పందిస్తూ, ప్రస్తుతానికి ఒక విమానాన్ని తాత్కాలికంగా బదిలీ చేయాలన్న ప్రతిపాదన మాత్రమే చర్చలో ఉందని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో బహుమతి ఇవ్వడం అనే విషయం ఇప్పటివరకు నిర్ణయించలేదని వెల్లడించారు.

Read More : టారీఫ్స్ విధానానికి భారత్ సన్నద్ధం..?