మైసూర్-ఉదయ్‌పూర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో ఉన్న చన్నపట్నం వద్ద మైసూర్ నుండి ఉదయ్‌పూర్‌కు వెళ్తున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ప్రయాణికుల్లో ఆందోళనకు కారణమైంది. అయితే లోకోపైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగుతున్న విషయం గమనించిన వెంటనే ఆయన రైలు నిలిపివేసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది రాకతో మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. తాత్కాలికంగా రైలు సేవలు నిలిపివేసి మరమ్మత్తులు చేపట్టారు. రైలు ఇంజిన్‌లో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

Read More : డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ ప్రకటన

One thought on “మైసూర్-ఉదయ్‌పూర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

Comments are closed.