భారత భూభాగాన్ని బంగ్లాదేశ్‌ ఆక్రమించలేదు: బీఎస్‌ఎఫ్‌ స్పష్టం

భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు: బీఎస్‌ఎఫ్

న్యూఢిల్లీ, జనవరి 8: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని బంగ్లాదేశ్‌ ఆక్రమించిందని వచ్చిన వార్తలను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎ్‌సఎస్‌) ఖండించింది. బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్‌ (బీజీబీ) దళాలు 5 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయని బంగ్లా మీడియా పేర్కొన్నప్పటికీ, బీఎ్‌సఎఫ్‌ ఈ వార్తలను పూర్తిగా నిరాధారమైన, బాధ్యతారహిత కట్టు కథలుగా పేర్కొంది.

“ఉత్తర 24 పరగణాల జిల్లా, రాంఘాట్‌ గ్రామంలోని బాగ్డా బ్లాక్‌లోని భూభాగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దు కొడలియా నదీ తీరం నుండి వెళ్ళిపోతుంది. ఇరువైపులా కచ్చితమైన హద్దులను గుర్తించి స్తంభాలు పాతి, కంచె వేసి ఉంది. ఈ సరిహద్దు వెంట బీఎ్‌సఎఫ్‌ గస్తీలో ఎలాంటి మార్పు జరగలేదు” అని బీఎ్‌సఎఫ్‌ అధికారిక ప్రకటనలో తెలిపింది.

భారత భూభాగాన్ని ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని, భవిష్యత్తులో కూడా తీసుకోలేరని బీఎ్‌సఎఫ్‌ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌ మాధ్యమాలలో ఉన్న కొన్ని వర్గాలు కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నాయని బీఎ్‌సఎఫ్‌ ఆరోపించింది.