హిట్ 4లో కార్తీ.. క్రికెట్ లవర్ ఆఫీసర్‌గా ఎంట్రీ!

Karthi in HIT 4

హిట్: ది థర్డ్ కేస్ విజ‌యం త‌ర్వాత, హిట్ ఫ్రాంచైజీకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ల‌భించింది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ల‌ర్‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు వివిధ భాష‌ల్లోనూ మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి. దీంతో నాల్గ‌వ భాగంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

హిట్ 4లో హీరో ఎవ‌ర‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మార‌గా.. కోలీవుడ్ హీరో కార్తీ లీడ్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. హిట్ 3లోనే ఈ క్యారెక్ట‌ర్‌ని పరిచయం చేశారు. ఇప్పుడు అతడు ఓ కొత్త కేసును ఛేదించే ఆఫీసర్‌గా స్క్రీన్‌పై దర్శించనున్నాడు.

ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో డైరెక్టర్ శైలేష్ కొల‌ను కార్తీ పాత్రపై కొన్ని హింట్స్ ఇచ్చాడు. “ఆఫీసర్‌కు క్రికెట్ ఇష్టం, బెట్టింగ్ చేస్తాడు, పాత్రలో ఫన్ టచ్ కూడా ఉంటుంది,” అని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు పూర్తి క‌థను కార్తీకి చెప్పకపోయినా, పాత్ర ఆధారంగా ఆయన ప్రాజెక్ట్‌కు అంగీకరించాడని అన్నారు.

ముందుగా పాత్రని పరిచయం చేసి తర్వాత కథను పూర్తి చేయడం అనేది హిట్ సిరీస్‌కి సాధారణ పద్ధతి. ఇదే తరహాలో హిట్ 4ను నిర్మించేందుకు డైరెక్టర్ సిద్ధమవుతున్నారు. అయితే శైలేష్ త‌దుప‌రి చిత్రాన్ని ఏ హీరోతో చేస్తాడ‌న్న‌ది ఇంకా రివీల్ కాలేదు.

Read More

One thought on “హిట్ 4లో కార్తీ.. క్రికెట్ లవర్ ఆఫీసర్‌గా ఎంట్రీ!

Comments are closed.