తాజాగా ఘనంగా జరిగిన వేవ్స్2025 సమ్మిట్‌లో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
శేఖర్ కపూర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఏఐ తరం సూపర్‌స్టార్లను తాను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. “నాకు అమితాబ్ అవసరం లేదు, నేను నా సొంత క్యారెక్టర్‌ను సృష్టిస్తాను” అంటూ చెప్పిన ఆయన మాటలు సంచలనం సృష్టించాయి.
అలాగే “నాకు షారుఖ్ ఖాన్ కూడా అవసరం లేదు, నేను నా స్టార్‌ను సృష్టిస్తాను. దానికి కాపీ రైట్ కూడా నాదే” అని శేఖర్ అన్నారు. మానవ నటనల స్థాయిని అధిగమించగల సామర్థ్యం ఏఐకి ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
శేఖర్ కపూర్ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏఐ ఆధారిత సినీ భవిష్యత్తు, టెక్నాలజీ ప్రభావంపై అతని విశ్లేషణపై సినీ ప్రియులు, నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు.

One thought on ““నాకు అమితాబ్, షారుఖ్ అవసరం లేదు” – శేఖర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!”
Comments are closed.