విజయ్ దేవరకొండ కెరీర్‌ను కొత్తస్థాయికి తీసుకెళ్లిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా విడుదలై ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. “ఎనిమిదేళ్ల క్రితం అర్జున్ రెడ్డి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది నా మనసుకు అత్యంత దగ్గరైన కథ. మీ ప్రేమ, మద్దతు వల్లే ఇది ఒక ఉద్యమంలా మారింది. ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్, ప్రతి భావోద్వేగం ప్రేక్షకుల మనసుకు తాకిందంటే, దానికి కారణం మీ అంగీకారమే” అని సందీప్ పేర్కొన్నారు.
తన నటీనటులకు, టెక్నీషియన్లకు, ముఖ్యంగా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “ఈ ఎనిమిదేళ్ల ప్రయాణం ఇంకా తాజాగా అనిపిస్తోంది. ఈ సినిమాను శాశ్వతంగా నిలిపినందుకు ధన్యవాదాలు” అని సందీప్ రాసుకొచ్చారు. ఆయన ఈ పోస్ట్‌తో పాటు సినిమా మేకింగ్‌లో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఉన్న పాత వీడియోను కూడా షేర్ చేశారు.
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ సంచలనం సృష్టించింది. భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఒక వర్గం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ, మరోవైపు విమర్శలకూ గురైంది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Error: No feed found.
Please go to the Instagram Feed settings page to create a feed.

One thought on “అర్జున్ రెడ్డి 8 ఏళ్లు: సందీప్ వంగా ఎమోషనల్ పోస్ట్”
Comments are closed.