నటి అవ్నీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పొరపాటున లైక్ ఇవ్వడం పెద్ద హంగామాకు దారి తీసింది. ఈ సంఘటనతో అవ్నీత్ సోషల్ మీడియా ఫాలోయర్ల సంఖ్య ఒక్కసారిగా 20 లక్షలు పెరగగా, ఏకంగా 12 బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేసే అవకాశాలు కూడా లభించాయని వార్తలు వెలువడ్డాయి.
ఈ విషయంపై ఇప్పటికే విరాట్ కోహ్లీ స్పందిస్తూ, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ క్లియర్ చేస్తూ అనుకోకుండా లైక్ బటన్ నొక్కానని, దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఇక తాజాగా అవ్నీత్ కౌర్ కూడా తనదైన శైలిలో ఈ అంశంపై స్పందించారు.
ప్రస్తుతం తన కొత్త చిత్రం “లవ్ ఇన్ వియత్నాం” ప్రమోషన్లలో బిజీగా ఉన్న అవ్నీత్, ఈ విషయంపై మాట్లాడుతూ – “ప్రేమ దొరుకుతూనే ఉండాలి… అంతకు మించి నేను చెప్పలేను” అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వైరల్ అంశంపై చర్చకు ముగింపు లభించినట్టయింది.
Read More : అర్జున్ రెడ్డి 8 ఏళ్లు: సందీప్ వంగా ఎమోషనల్ పోస్ట్

One thought on “Avneet Kaur Response : విరాట్ లైక్ వెనక అసలు నిజం ఏమిటి?”
Comments are closed.