రాజా సాబ్ రిలీజ్ క్లారిటీ లేదు – మరోసారి డేట్ పోస్ట్‌పోన్ అవుతుందా?

Prabhas Raja Saab release update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం రాజా సాబ్’ గురించి ఎన్నో రోజులుగా చర్చ జరుగుతోంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించడంతో, సినిమాపై ఆసక్తి పెరిగింది. ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే హైప్ క్రియేట్ చేసిన రాజా సాబ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే రిలీజ్ విషయంలో మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మొదట డిసెంబర్ 2024లో రిలీజ్ చేస్తామని చెప్పినా, తర్వాత ఏప్రిల్ 10 అని ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీ దగ్గరపడుతున్నా కూడా ఎలాంటి ప్రమోషన్‌ లేకపోవడంతో, సందేహాలు మరింత పెరిగాయి. మధ్యలో దసరా, దీపావళి కానుకగా విడుదల అవుతుందని టాక్ వచ్చినా, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా 2026 సంక్రాంతి విడుదల అనే వార్తలు వినిపిస్తున్నా, ఇంకా అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం, కొంత టాకీ పార్ట్ మరియు నాలుగు పాటల షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ మాత్రం అసలేం జరుగుతోందో చెప్పమంటూ మేకర్స్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆలస్యమవ్వడం వలన బజ్ తగ్గిపోతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. రాజా సాబ్ తర్వాత స్టార్ట్ అయిన మిరాయ్ మూవీ వేగంగా పూర్తవుతుండగా, రాజా సాబ్ మాత్రం ఇంకా ఊహల మధ్యనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కారణాలు ఎంతటి సమర్థవంతమైనవైనా, ఫ్యాన్స్‌కు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మేకర్స్‌పై ఉందని నెట్‌లో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి, ప్రభాస్ అభిమానులు మాత్రం “తక్కువ మాటలు, ఎక్కువ క్లారిటీ” కోరుకుంటున్నారు.

Read More



One thought on “రాజా సాబ్ రిలీజ్ క్లారిటీ లేదు – మరోసారి డేట్ పోస్ట్‌పోన్ అవుతుందా?

Comments are closed.