టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌పై మరోసారి ఆసక్తికర చర్చ.

బాలీవుడ్ సీరియల్స్‌తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. దర్శకుడు అజయ్ భూపతితో చేసిన తొలి చిత్రంతోనే పాయల్ టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఆ హిట్ తర్వాత పాయల్ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.

ఆర్‌ఎక్స్ 100 తరహాలో వచ్చిన కొన్ని కథలను పాయల్ తిరస్కరించగా, ఆమె చేసిన ఇతర సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మధ్యలో పది పైచిలుకు చిత్రాల్లో నటించినా, మళ్ళీ అజయ్ భూపతితో చేసిన ‘మంగళవారం’ సినిమా పాయల్ టాలెంట్‌ను మరోసారి రుజువు చేసింది. అయినప్పటికీ, ఆ సినిమా అనంతరం ఆమె కెరీర్ గాడిలో పడుతుందని భావించిన ఆశలు ఫలించలేదు.

ప్రస్తుతం పాయల్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో, తెలుగు సినిమా ‘కిరాతక’లో ఆది సాయికుమార్ సరసన నటిస్తోంది. అదేవిధంగా తమిళ చిత్రాల్లో ‘గోల్ మాల్’ను పూర్తిచేసిన పాయల్, ప్రస్తుతం ‘ఏంజెల్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలతో మళ్లీ ఫాంలోకి రావాలని పాయల్ ఆశిస్తోంది.

అందానికి తోడు నటనలో మంచి సత్తా ఉన్న పాయల్‌ వంటి గ్లామర్ బ్యూటీకి సరైన కథలు దొరికితే, ఆమె టాలీవుడ్‌లో తన ప్రత్యేక స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడంలో సందేహం లేదు. అయితే రానున్న ప్రాజెక్టులతో ఆమెకు ఎంతవరకు సక్సెస్ రేటు దక్కుతుందో వేచి చూడాలి.

పాయల్‌ ఫ్యాన్స్ మాత్రం ఆమెకు మంచి కంబ్యాక్ కావాలని, మళ్లీ ఓ మెరుగైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ పలు అవకాశాలను సొంతం చేసుకుంటున్న పాయల్, ప్రేక్షకుల మన్ననలు పొందగలుగుతుందా? అనేది త్వరలోనే తేలనుంది.

Read More : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్ సందడి