ఏపీలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ వివరాలు వెల్లడిస్తూ, “ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు జీరో టికెటింగ్ విధానంలో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది” అని తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మహిళలు లబ్ధి పొందనున్నారు.

Read More : ఆగస్టు 15 నుంచి 700 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో

One thought on “ఏపీలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

Comments are closed.