ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూసూద్ పరామర్శ

ఇటీవల కాలం చేసిన ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని నటుడు సోనూసూద్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని వెంకట్ నివాసానికి వెళ్లిన సోనూసూద్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సోనూసూద్ వెంకట్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. “ఫిష్ వెంకట్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు” అని సోనూసూద్ అన్నారు. అలాగే, వెంకట్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని, భవిష్యత్తులో వారికి తోడుగా నిలబడతానని హామీ ఇచ్చారు.

సోనూసూద్ గతంలోనూ కరోనా సమయంలోనూ, ఇతర కష్టకాలంలోనూ అనేక మందికి సహాయం చేసి మంచి మనసును చాటుకున్నారు. ఇప్పుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి కూడా అండగా నిలబడటంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read More : తెలుగు అభిమానుల కోసం రజనీకాంత్ స్పెషల్ వీడియో