ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. గత నెల 17న బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా చెవిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు.

దాదాపు 40 రోజులుగా జైలులోనే ఉన్న చెవిరెడ్డి ఇప్పటివరకు పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో పరారీలో ఉన్న 12 మంది నిందితులపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. వారిని అరెస్టు చేయాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన న్యాయస్థానం వారెంట్లను జారీ చేసింది.

ఈ కేసులో అవినాశ్ రెడ్డి, పురుషోత్తం, అనిరుధ్ రెడ్డి, షేక్ సైఫ్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బొల్లారం శివ, రాజీవ్ ప్రతాప్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు.

Read More : సంప్రదాయ విద్య సరిపోదు, జీవితకాల నైపుణ్యాభివృద్ధి అవసరం

One thought on “ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Comments are closed.