ఏపీ మున్సిపల్ శాఖ ఔట్సోర్సింగ్ వర్కర్లకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ నాన్-పబ్లిక్ హెల్త్ (నాన్ పీహెచ్) వర్కర్లకు గుడ్ న్యూస్. వారి వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జీవన ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వేతనాల పెంపుతో వర్కర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వారి జీవిత స్థాయిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

Read More : డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

One thought on “ఏపీ మున్సిపల్ శాఖ ఔట్సోర్సింగ్ వర్కర్లకు శుభవార్త

Comments are closed.