విదేశీ బ్యాంకుల రుణాల కోసం చర్చలు

ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కీలక దశలోకి అడుగుపెట్టింది. త్వరలోనే మెట్రో పరుగులు తీయనున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ముఖ్యమైన చర్చలు జరిపారు.

మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి AIIB సహా పలు అంతర్జాతీయ బ్యాంకుల ప్రతినిధులను కలిసి రుణాలపై సంప్రదింపులు నిర్వహించారు. తక్కువ వడ్డీకి రుణాలివ్వగల బ్యాంకులతో చర్చలు కొనసాగుతున్నాయి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, KFW, AFD, ADB, NDB, AIIB, జైకా, ప్రపంచ బ్యాంకుల ప్రతినిధులు విశాఖపట్నం మెట్రోకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్ల రుణం సమీకరించాలని ముందస్తు అంగీకారం వ్యక్తం చేశారు.

ఇప్పటికే రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి. డీపీఆర్‌లు సిద్ధమవగా, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికావచ్చింది. అమరావతి అభివృద్ధితో పాటు, విజయవాడ – విశాఖ నగరాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు మెట్రో ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి.

కూటమి ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులకు వేగం ఇవ్వడంలో కీలక చర్యలు తీసుకుంటుండగా, కేంద్రం నుంచి కూడా అనుమతి లభించడంతో ఈ ప్రాజెక్టుల రూపురేఖలు స్పష్టమవుతున్నాయి.

Read More : జకియా ఖాన్ బిజేపి పార్టీలో చేరినట్టు ప్రకటించారు.

One thought on “విదేశీ బ్యాంకుల రుణాల కోసం చర్చలు

Comments are closed.