ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మూడు రోజుల మహానాడు కార్యక్రమాన్ని గురువారం ముగించనున్నారు. మహానాడు ముగిసిన వెంటనే, చంద్రబాబు ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
రేపు (మే 31) ఆయన ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరగనున్న “కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)” వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) పాల్గొననున్నారు. ఈ సమావేశం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జరుగనుంది. అనంతరం చంద్రబాబు ఢిల్లీలోనే రాత్రి బస చేస్తారు.
కోనసీమలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం
శనివారం (జూన్ 1) ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గునేపల్లి గ్రామానికి ప్రయాణిస్తారు.
అక్కడ నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేస్తారు. ఈ పింఛన్ల పంపిణీ మామూలుగా ప్రతినెలా 1వ తేదీన నిర్వహిస్తారు. అయితే ఈసారి జూన్ 1 ఆదివారం కావడంతో, మే 31వ తేదీన ముందుగానే కార్యక్రమం చేపడుతున్నారు.
గ్రామస్తులతో ముఖాముఖి – పార్టీ నేతలతో భేటీ
పింఛన్ల పంపిణీ అనంతరం, చంద్రబాబు గ్రామస్థులతో ముఖాముఖి చర్చలు జరిపి, వారి అభిప్రాయాలు వింటారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు.
అన్ని కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శనివారం సాయంత్రం 5:15 గంటలకు ముమ్మిడివరం నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ఖచ్చితంగా పర్యవేక్షిస్తోంది.
Read More : వంగవీటి విగ్రహంపై కాపు సంఘాల ఆందోళన

One thought on “ఆపై కోనసీమ పర్యటనకు సీఎం షెడ్యూల్ ఖరారు”
Comments are closed.