ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 55 మంది వైద్యులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఏకంగా ఏడాదికిపైగా ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఈ విషయాన్ని లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లారు. వైద్యుల గైర్హాజరు కారణంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదును లోకాయుక్త సీరియస్‌గా పరిగణించి, విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, అనుమతులు లేకుండా విధులకు హాజరుకాని వైద్యులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. లోకాయుక్త ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. విచారణ అనంతరం 55 మంది వైద్యులు డిస్మిస్ అయ్యారు.
ఈ నిర్ణయంతో ఉద్యోగాలను కోల్పోయిన వైద్యులు ఆందోళనకు గురవుతున్నారు. కానీ, విధులకు గైర్హాజరైన వారు ఎలాంటి ముందస్తు అనుమతులు పొందకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

One thought on “ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు”
Comments are closed.