ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘స్త్రీ శక్తి’ పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ఆగస్టు 15వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అధికారికంగా జీవో జారీ చేసింది.
ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు ఆర్టీసీ బస్సులలో ఎటువంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం మహిళల సాధికారతకు మరియు ఆర్థిక స్వాతంత్ర్యానికి దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు.


Read More : బద్వేల్‌లో భారీ నగల చోరీ

One thought on “ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం”
Comments are closed.