అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్

Andhra Pradesh Budget

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. గతేడాది ప్రవేశపెట్టిన రూ.2.94 లక్షల కోట్ల ఓటాన్‌ ఎకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే, ఈసారి దాదాపు 10 శాతం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమానికి సమతుల్య ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని సమాచారం. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయించనున్నారు. సూపర్ సిక్స్‌లో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలకు కూడా భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం సహకారంతో వీటిని అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారట. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం గమనార్హం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.

Read More

One thought on “అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్

Comments are closed.