అసెంబ్లీలో హాజరు వివాదం.. వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం

AP Assembly Speaker

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly)లో సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో 25 ప్రశ్నలకు సమాధానాలు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల తీరుతో మరో ఇద్దరు సభ్యులు ప్రశ్నలు అడగడానికి ఇబ్బంది ఏర్పడుతోందని స్పీకర్ అన్నారు.

సభ్యులు సభకు రావాలని, ప్రజా ప్రతినిధులుగా గౌరవంగా వ్యవహరించాలని సూచించిన ఆయన, వైఎస్సార్సీపీ (YSRCP) సభ్యుల తీరుపై మండిపడ్డారు. వారు “దొంగల్లా” సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ రిజిష్టర్‌లో సంతకాలు చేసిన వారిని సభలో చూడలేదని అయనన్నపాత్రుడు తెలిపారు.

సభా హాజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం సభ్యుల గౌరవాన్ని తగ్గిస్తుందని స్పీకర్ వ్యాఖ్యానించారు. వై బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధ రెడ్డి, విశ్వేశరరాజులు తదితరులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆయన వెల్లడించారు.

గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో వీరు సంతకాలు చేసి వెళ్లినట్లు ఆయన తెలిపారు. మీకు ఓట్లు వేసిన ప్రజలకు ఇలాంటి చర్యలు తలవంపులు తెచ్చేలా ఉంటాయని, గౌరవంగా సభకు హాజరై మాట్లాడాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.

Read More

One thought on “అసెంబ్లీలో హాజరు వివాదం.. వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం

Comments are closed.