ఏపీ అసెంబ్లీలో హంగామా: గవర్నర్ ప్రసంగం సందర్భంగా నినాదాలతో వైసీపీ నేతల నిరసన, సభ నుంచి బయలుదేరిన జగన్
అమరావతి: సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
సుమారు ఐదు నిమిషాల పాటు నినాదాలు చేసిన అనంతరం వైఎస్ జగన్ సభను వీడి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంట వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బయటకు వెళ్లారు. అయితే, నినాదాల నడుమ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

2 thoughts on “ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతల నిరసన”
Comments are closed.