ఏపీలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్: రెండు రోజుల వర్షాలు, ఎండలు మరింత పెరిగే అవకాశం

Weather

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తాజా అంచనాను వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

అల్పపీడన ద్రోణి ప్రభావం:
తమిళనాడు తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, హిందూ మహాసముద్రం మరియు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వివరించారు.

రాబోయే మూడు రోజుల వాతావరణ సూచన:
➡️ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం: మంగళవారం నుంచి గురువారం వరకు పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు.

➡️ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: మంగళవారం నుంచి గురువారం వరకు పొడి వాతావరణం కొనసాగనున్నట్లు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.

➡️ రాయలసీమ: మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గురువారం మాత్రం పొడి వాతావరణం నెలకొననుంది.

వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సూచించారు.

Read More

One thought on “ఏపీలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్: రెండు రోజుల వర్షాలు, ఎండలు మరింత పెరిగే అవకాశం

Comments are closed.