గోపీచంద్ కొత్త సినిమా: సంపత్ నంది స్థానంలో సంకల్ప్ రెడ్డి

Gopichand and Sankalp Reddy

మాస్ హీరో గోపీచంద్ బీ, సీ సెంటర్లలో మంచి క్రేజ్ కొనసాగిస్తూనే ఉన్నా, ఆయనకు సరైన హిట్ రావడం లేదు. ‘పక్కా కమర్షియల్’, ‘భీమా’, ‘విశ్వం’ సినిమాలు ఓపెనింగ్స్ మాత్రం సాధించాయి కానీ, నెగిటివ్ టాక్ వల్ల నిలదొక్కుకోలేకపోయాయి. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలని గోపీచంద్ పట్టుదలగా ఉన్నాడు.

అందుకోసం తొలుత పూరీ జగన్నాథ్ తో ‘గోలీమార్’ సీక్వెల్ చేయాలని భావించినా, ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో, సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఇంతకుముందు ‘సీటీమార్’ వంటి హిట్ అందించిన కాంబినేషన్ కావడంతో, ఈ సినిమా కూడా పట్టాలెక్కడం ఖాయమని అందరూ భావించారు.

అయితే, అనుకోని విధంగా సంపత్ నంది ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా వచ్చారు. మాస్ జోనర్‌లో పెద్దగా అనుభవం లేని ఆయన, గోపీచంద్‌తో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇది గోపీచంద్ 33వ సినిమా. ఈ ఏడాది చివరికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read More

One thought on “గోపీచంద్ కొత్త సినిమా: సంపత్ నంది స్థానంలో సంకల్ప్ రెడ్డి

Comments are closed.