హరిహర వీరమల్లులో అనసూయ లుక్ విడుదల – రాజ కుటుంబ మహిళగా ఛార్మింగ్ లుక్!

Anasuya's role in Hari Hara Veera Mallu

బుల్లితెర నుంచి వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె హరిహర వీరమల్లు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్నాళ్లూ ఈ సినిమాలో అనసూయ పాత్రపై స్పష్టత లేకపోయినా, తాజాగా ఆమె సోషల్ మీడియాలో తన లుక్‌ను షేర్ చేసింది.

ఈ ఫోటో చూస్తే, ఆమె రాజ కుటుంబానికి చెందిన మహిళగా కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. ఫోటో విడుదలైన క్షణాల్లోనే పవన్ కళ్యాణ్ అభిమానులు సహా సినీ ప్రియులు తెగ షేర్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో చిట్‌చాట్ చేసిన అనసూయ, హరిహర వీరమల్లు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఓ అభిమాని కొల్లగొట్టేసిందిరో పాట బీటీఎస్ చూపించమని అభ్యర్థించగా, అనసూయ ఈ ఫోటోను షేర్ చేయడం విశేషం. అయితే, పవన్ కళ్యాణ్‌తో ఫోటో ఉందా? అని ప్రశ్నించగా, తన వద్ద లేదని వెల్లడించింది.

మరోవైపు, బుల్లితెరపై మళ్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నాం అని అభిమాని పేర్కొనగా, కమింగ్ సూన్ అంటూ త్వరలోనే బుల్లితెరపై రీ-ఎంట్రీ ఇస్తానని హింట్ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ప్రస్తుతం జ్యోతి కృష్ణ నేతృత్వంలో కొనసాగుతోంది. ముందుగా మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను మే నెలకు వాయిదా వేశారు.

షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఆలస్యమవుతున్నప్పటికీ, చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అనసూయ తాజా లుక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు. హరిహర వీరమల్లులో ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి!

Read More

One thought on “హరిహర వీరమల్లులో అనసూయ లుక్ విడుదల – రాజ కుటుంబ మహిళగా ఛార్మింగ్ లుక్!

Comments are closed.