ఉప్పెన’ హీరోయిన్‌గా మొదట ఎవరు అనుకున్నారు? ఈ క్రేజీ బ్యూటీ ఎందుకు వదులుకుందో తెలుసా?

Shivani Rajasekhar

మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా మెగాఫ్యామిలీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా, కృతి శెట్టి కూడా హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది.

అయితే, కృతి శెట్టికి ముందు ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సింది మరో హీరోయిన్ అని మీకు తెలుసా? సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కే మొదట ఈ అవకాశం వచ్చింది. అయితే, స్క్రిప్ట్ బోల్డ్‌గా ఉండటంతో తాను ఈ సినిమా చేయలేకపోయానని శివాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

“మొదట నా దగ్గరికి ‘ఉప్పెన’ కథ వచ్చింది. అయితే, అప్పట్లో కథ చాలా బోల్డ్‌గా ఉండేది. లిప్‌లాక్స్ సహా కొన్ని సన్నివేశాలు ఉండటంతో నాకొంత అసౌకర్యంగా అనిపించింది. ఆ సందర్భంలో అంత బోల్డ్ కాన్సెప్ట్ చేయలేను అనిపించి సినిమా చేయలేదు అని చెప్పుకొచ్చింది శివాని.

తన నుంచి ఈ అవకాశం మిస్ అయితే, కృతి శెట్టి వచ్చి నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ‘ఉప్పెన’ తర్వాత కృతి కెరీర్ బాగానే ముందుకు సాగుతోంది. మరి, శివాని ఈ సినిమా చేసుంటే ఆమె కెరీర్ ఎలా ఉండేదో అన్నది ప్రశ్నే!

Read More

One thought on “ఉప్పెన’ హీరోయిన్‌గా మొదట ఎవరు అనుకున్నారు? ఈ క్రేజీ బ్యూటీ ఎందుకు వదులుకుందో తెలుసా?

Comments are closed.