బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్నాథ్ యాత్ర మరింత సులభంగా మారిందని పేర్కొన్నారు. యాత్ర మార్గంలో రోడ్లు, భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలన్నీ మెరుగ్గా అందుబాటులో ఉన్నాయని రాజాసింగ్ తెలిపారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా స్థానిక ముస్లిం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కశ్మీర్లో శాంతి నెలకొందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని రాజాసింగ్ అన్నారు.
Read More : హైకోర్టులో కొణతం దిలీప్‌కు స్టే ఊరట
