హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అసోసియేషన్ బాడీని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీతో టికెట్ల వివాదం నేపథ్యంలో ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి. గత మ్యాచ్ సందర్భంగా కార్పొరేట్ బాక్సులలోకి టికెట్లు ఇవ్వలేదని ఆరోపణల మధ్య, హెచ్‌సీఏ అధికారులు బాక్స్‌కు తాళం వేసిన ఘటన చర్చనీయాంశమైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన SRH యాజమాన్యం హైదరాబాద్‌ను వదిలే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేసింది.

ఈ వివాదంపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించగా, హెచ్‌సీఏ అధ్యక్షుడు SRH పై ఒత్తిడి తెచ్చినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. తాజా పరిణామాలతో హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Read More : Yash Dayal : ఎదురు ఫిర్యాదుతో వివాదం మలుపు