భారతదేశంలో టర్కీకి చెందిన విమానాశ్రయ సేవల సంస్థ సెలెబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలందిస్తున్న ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్ (భద్రతా అనుమతులు)ను రద్దు చేసింది.
ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. సెలెబీకి 2022 నవంబర్ 21న BCAS (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ) ద్వారా జారీ చేసిన భద్రతా అనుమతులు ఇకపై అమాన్యమైనవేనని తెలిపింది. ఈ రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.
భారతదేశ విమానాశ్రయాల్లో సేవలు అందిస్తున్న విదేశీ సంస్థలకు సంబంధించి భద్రత అంశాల్లో కేంద్రం తీసుకుంటున్న కఠిన నిర్ణయాల్లో ఇది ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. టర్కీ సంస్థపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం విమానాశ్రయ భద్రతను మరింత బలపర్చేందుకు చేసిన ప్రాధాన్యత నిర్ణయంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Read More : కీలక వ్యాఖ్యలు చేసిన జైశంకర్
