ఒక నటుడిగా ఎదుగుదల అనేది అంత ఈజీ కాదు. అయితే అల్లు అర్జున్‌కి ఇది సాధ్యం అయ్యింది. “గంగోత్రి”తో వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ, ప్రారంభంలోనే అతడికి కొందరు విమర్శలు ఎదురయ్యాయి. రూపం, ముఖ కవళికలపై ట్రోల్స్ ఎదురైనా.. వాటిని పట్టించుకోకుండా కష్టపడి తనను తాను నిరూపించుకున్నాడు. నటన, డ్యాన్స్, స్టైల్ అన్ని కలగలిపిన అనుభూతితో స్టైలిష్ స్టార్‌గా, ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు.
అనేక ఒడిదుడుకుల నడుమ ప్రయాణం చేసిన బన్నీ, “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ చిత్రంతో అతని పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. లుంగీ, రఫ్ లుక్‌లో కనిపించిన బన్నీ నటనలో తన స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు “పుష్ప 2″తో 1800 కోట్ల క్లబ్‌ను టార్గెట్ చేస్తూ… తదుపరి సినిమాల కోసం భారీ లెవెల్లో ప్లానింగ్ చేస్తూ, ఇండియన్ సినీ లవర్స్‌కి వరుసగా సర్ప్రైజ్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
తాజాగా బన్నీ, దర్శకుడు అట్లీతో కలిసి ఓ మాగ్నమ్ ఓపస్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనుంది. జాన్వీ కపూర్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటించనున్నారని సమాచారం. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ ఫిల్మ్, ఆ తరువాత “పుష్ప 3” సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ భారీ ప్రాజెక్ట్ 2028లో రిలీజ్ అవుతుందనగా, ఇందులో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

One thought on “ఫ్యాన్స్‌కు ఫెస్టివల్.. బన్నీ బర్త్‌డేకి బిగ్ అప్డేట్స్!”
Comments are closed.