సాయి పల్లవి: ‘నిజాయితీ’పై నమ్మకం, గ్లామర్‌కి దూరం!

Sai Pallavi's acting principles

సాయి పల్లవిని సినిమాలోకి ఒప్పించడమే ఓ పెద్ద సవాలు అని దర్శకుడు చందు మొండేటి ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ‘తండేల్’ సినిమాలో ఆమె నటించడంతో తన అనుభవాన్ని పంచుకున్నారు. సాయి పల్లవి పాత్రలపై వచ్చే డౌట్లు సాధారణమైనవేమీ కావని, ఆమెను ఒప్పించాలంటే దర్శకులకు బాగా కష్టమని వివరించారు.

తాజాగా సాయి పల్లవి కూడా తన కథల ఎంపికపై స్పందించారు. ఏ పాత్రను ఎంచుకున్నా, దాని లోతు, భావోద్వేగం ఎంత ఉందన్నదే తనకు ముఖ్యమని చెప్పారు. ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులతో ఎలాంటి కనెక్షన్ ఏర్పడుతుందో చూడాలని, అవార్డుల కంటే ప్రేక్షకుల అభిమానాన్ని నేను ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తాను అని చెప్పారు.

అందుకే సాయి పల్లవి తక్కువ సినిమాలు మాత్రమే చేస్తూ, తనకు నచ్చిన పాత్రలకే పరిమితం అవుతున్నారని తెలిపారు. గ్లామర్ పాత్రలు చేయడం, ప్రకటనలలో నటించడం వంటి వాటికి దూరంగా ఉంటూ, నిజాయితీగల పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు.

ఎంత పెద్ద ఆఫర్లు వచ్చినా, కోట్లు ఇస్తామన్నా, తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా వస్తే నిరాకరించేస్తుందట. ఈ ప్రత్యేకత, ఈ నిజాయితీతోనే సాయి పల్లవి తెలుగు సినీప్రేక్షకుల మన్ననలు గెలుచుకుంటోందని పరిశ్రమలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More

One thought on “సాయి పల్లవి: ‘నిజాయితీ’పై నమ్మకం, గ్లామర్‌కి దూరం!

Comments are closed.